YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Security: తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాల్సిన మాజీ ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద భారీగా ప్రజలు చేరుకున్నప్పటికీ వారిని నియంత్రించేందుకు తగిన భద్రతా సిబ్బంది లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని ఆయన ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్న విషయం తెలిసినా సరైన భద్రత కల్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఏపీ డీజీపీకి తాను నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ ఉదయం అవి కనిపించకుండా పోవడం వెనుక కుట్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దాని బాధ్యతను జగన్‌పైనే మోపేలా పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. చివరకు పార్టీకి చెందిన యువ వాలంటీర్లను నియమించి జగన్ పర్యటనను సురక్షితంగా పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా రాష్ట్ర డీజీపీపై విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థ నిష్పాక్షికంగా వ్యవహరించాలని, లేకపోతే యూనిఫాం తీసి ఎల్లో యూనిఫాం వేసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!