BJP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే ఎంపీలు మొదలుకొని.. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కిందిస్థాయి ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది.. పార్టీకి గుడ్‌బై చెప్పి.. కూటమి పార్టీల్లో చేరుతున్నారు.. ఇక, తాజాగా, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. బిక్కవోలులో పలువురు వైసీపీ ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేసి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.. ఈ సందర్భంగా వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీపీ ఎన్నికల్లో తొస్సిపూడి ఎంపీటీసీ సభ్యురాలు తేతలి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, రిటర్నింగ్ అధికారి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి.. నూతన ఎంపీపీ సుమకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో, రాష్ట్రంలో తొలి బీజేపీ ఎంపీపీగా తేతలి సుమ ఎన్నికయ్యారు. గతంలో వైసీపీ ఎంపీపీ రాజీనామా చేయగా ఆ పదవికి నేడు ఎన్నికలు జరిగిన విషయం విదితమే..
Read Also: Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
అయితే, అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీపీ స్థానం కోసం.. వైఎస్ఆర్సీపీకి చెందిన పదిమంది ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నట్టు బీజేపీ నేతలపై విమర్శలు వినిపిస్తున్నాయి.. కో ఆప్షన్ సభ్యులు ఓట్లతో కలిపి బిక్కవోలు ఎంపీపీ పదవిని బీజేపీ దక్కించుకుంది.. రాష్ట్రంలో బీజేపీ తరపున ఎన్నికైన మొట్టమొదటి ఎంపీపీ స్థానం ఇదే.. తొస్సిపూడికి చెందిన సుమా సూర్య చంద్రారెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు.. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం కొనసాగినట్టు చెబుతున్నారు.. ఎన్నికకు కొద్దిసేపటి ముందే బీజేపీలో చేరి కండువాలు మార్చుకున్నారు ఎంపీటీసీలు..