తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కోలమూరులో యువకుడి హత్య సంచలనం రేపుతోంది. గత నెల 24న నాగసాయి అలియాస్ వెంకటేష్ (25) అనే యువకుడిని నలుగురు నిందితులు హత్య చేశారు. వెంకటేష్ మృతదేహాన్ని నిందితులు ముక్కలు చేసి రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమకు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన కసాయి తండ్రి
ఈ నేపథ్యంలో సగం కాలిన మృతదేహాన్ని రాజానగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్ హత్య కేసులో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.