Site icon NTV Telugu

Students Letter: ఒక్కసారి మా స్కూల్‌కి రండి.. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి విద్యార్థుల ఉత్తరాలు..

Students Letter

Students Letter

Students Letter: ఒక్కసారి మా పాఠశాలకు రండి చూడాలని ఉంది అంటూ ఓ పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కి ఉత్తరాలు రాశారు.. తమ స్కూల్‌లో కల్పించిన సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేసిన ఆ విద్యార్థులు.. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి ధన్యవాదులు తెలుపుతూ.. ఒక్కసారి మా స్కూల్‌కి రండి.. మిమ్మల్ని చూడాలని ఉంది అంటూ ఉత్తరాలు రాశారు.

Read Also: Woman Swallows Pens: ఇదేందయ్యా ఇది..! భర్త మీద కోపంతో పెన్నులు మిగింది.. చివరకు..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఆరోవ తరగతి విద్యార్థులు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కి లేఖలు రాశారు.. మా స్కూల్‌లో మంచి విద్యాభ్యాసం అందించడానికి.. సౌకర్యాలు కల్పించినందుకు థ్యాంక్స్ చెబుతూ.. ఆ ముగ్గురికి ఉత్తరాలు రాశారు.. స్కూల్‌ దగ్గరలో ఉన్న పోస్ట్ బాక్స్ లో ఈ ఉత్తరాలు అన్ని పోస్ట్ చేశారు. మరి ఉత్తరాలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లకు చేరుతాయా..? విద్యార్థుల కోరిక మేరకు ముగ్గురిలో ఏ ఒక్కరైనా సీతానగరం పర్యటనకు వచ్చినప్పుడు.. ఆ స్కూల్‌ను సందర్శిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది..

Exit mobile version