Site icon NTV Telugu

Undavalli Arun Kumar: సోము వీర్రాజు సవాల్‌ను స్వీకరిస్తున్నా.. టైం, ప్లేస్‌ చెప్పాలని ఉండవల్లి ఛాలెంజ్

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. టైం, ప్లేస్ చెబితే కచ్చితంగా బహిరంగ చర్చకు వస్తానంటూ సోము వీర్రాజుకు ప్రతి సవాల్ చేశారు ఉండవల్లి.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం, లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చ జరుపుకుందాం.. మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజుకు అన్ని విషయాలు కచ్చితంగా తెలుసు ఉన్నారు ఉండవల్లి..

Read Also: Telangana : తెలంగాణలో పెరుగుతున్న సైబర్ మోసాలు, ఆధునిక పద్ధతులతో ప్రజలను ఉరితీస్తున్న మోసగాళ్లు

కాగా, ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తికి ఓటు వేయొద్దని తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విజ్ఞప్తి చేయడంపై సోము వీర్రాజు ఫైర్ అయిన విషయం విదితమే.. అంతే కాదు, బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లికి సవాల్ చేశారు. దీనిపై స్పందించిన ఉండవల్లి.. తాను చర్చకు రెడీ.. టైం, ప్లేస్‌ చెప్పాలని సోము వీర్రాజుకు సూచించారు.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తాను ఎందుకు వ్యతిరేకిస్తానో ఈ బహిరంగ చర్చ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. దీంతో ఇద్దరి మధ్య బహిరంగ చర్చ నిజంగానే జరగబోతుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version