Site icon NTV Telugu

Dwarakanath Reddy: పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని ప్రయత్నం.. మిథున్‌రెడ్డిని టెర్రరిస్టులా చూస్తున్నారు..!

Dwarakanath Reddy

Dwarakanath Reddy

Dwarakanath Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిను ములాఖత్ లో కలిశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందన్నారు.. మిథున్‌రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు అని మండిపడ్డారు.. చంద్రబాబుకు లోకేష్, ప్రభుత్వానికి గాని ఈ పరిస్థితిమంచిది కాదని హెచ్చరించారు.. పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు.. కనీసం, మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితి కల్పిస్తున్నారు.. ములాఖత్ లో సైతం పక్కనే పోలీసులు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: AR Rahman : హైదరాబాద్‌లో రెహమాన్ కన్సర్ట్.. పాట వినాలంటే పర్సు ఖాళీ కావాల్సిందే!

ఏతప్పు చేయని మనిషిని దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారు.. శత్రువుకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు అన్నారు ద్వారకనాథ్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ఆయన కొడుకులా మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండేవాళ్లమన్న ఆయన.. మాపై కక్ష సాధించేవాళ్లను కచ్చితంగా భగవంతుడు చూస్తాడు.. ఇటువంటి కేసులు బనాయించి ఇబ్బంది పెట్టటం ప్రభుత్వానికి మంచిది కాదని హితవుచెప్పారు.. చార్జ్ షీట్‌లో కూడా మిథున్ రెడ్డి పేరు లేదు.. చంద్రబాబు కంటే ముందు నుంచి మా కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉందన్నారు.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో కథలు చెప్పారు.. మిథున్ రెడ్డిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పలేకపోతున్నారని దుయ్యబట్టారు.. సాధారణ వ్యక్తులు సైతం ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.. మేం వెళ్ళినప్పుడు మాత్రం నలుగురు పోలీసులు ఉంటున్నారు… కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా… తమకు రాలేదు.. అందలేదు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు.. అరెస్టు చేయటానికి ఒక్క ఆధారం దొరకలేదు… ఏదో ఒక కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్‌ రెడ్డి..

Exit mobile version