Site icon NTV Telugu

Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ.. యువతులతో అశ్లీల నృత్యాలు, 26 మంది అరెస్ట్!

Rev Party

Rev Party

Rave Party: పచ్చదనంతో ఎప్పుడూ పాడి పంటలతో ఉండే తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. పుట్టినరోజు సందర్భంగా ఘంటవారిగూడెంలో యువతులతో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి 23 మంది పురుషులతో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. వెస్ట్రన్ మొజులో పడి యువత పెడదారి పట్టి ఇటువంటి సంఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: క్లాసిక్ లుక్, మోడ్రన్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచ్చేస్తున్న Indian Scout బైకులు.. లాంచ్కు ముహూర్తం ఫిక్స్!

అయితే, గత ఏడాది క్రితం ఇదే రోజున ఆ గెస్ట్ హౌస్ ప్రాంతంలో పోలీసులు రైడ్ చేసి అప్పట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. పోలీసులు ఎన్నిసార్లు రైడ్ చేసిన మా పని మాదే అంటూ కొందరు వ్యక్తులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న వ్యక్తి వెజ్జే సుబ్బారావు జనసేన నాయకుడు అని సమాచారం.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ దాడులు పట్టుబడిన 26 మందిపై పోలీస్ లు కేసు నమోదు చేసి పలు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version