Site icon NTV Telugu

Most Wanted Criminal: పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. రంగంలోకి 10 టీమ్‌లు..

Bathula Prabhaka

Bathula Prabhaka

Most Wanted Criminal: ఐదు రాష్ట్రాల్లో వందకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు రెండోసారి షాక్‌ ఇచ్చాడు.. మోస్ట్ వాంటెట్ క్రిమినల్ అని తెలిసికూడా ప్రభాకర్‌ను తరలించే సమయంలో పోలీసులు అజాగ్రత్తగా ఉన్నారా..? లేదా గత రాత్రి పోలీసుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కు ఎవరు సహకరించారు..? అనే కోణంలో ఇపుడు చర్చ నడుస్తోంది. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో రిమాండ్ ఖైదీ బత్తుల ప్రభాకర్ తూర్పుగోదావరిజిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో తప్పించుకున్నాడు. చేతికి బేడీలు ఉన్నాయని, అతన్ని పట్టిస్తే నజరానా ఇస్తామంటూ ప్రకటన ఇచ్చన పోలీసులు.. అతని విషయంలో ఎందుకు సీరియస్‌గా ఉండలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్ళ ఎస్కార్ట్‌ నుంచి తప్పించుకుపోయి గంటలు గడుస్తున్నా పోలీసులకు తిరిగి చిక్కకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగానే ప్లాన్ చేసుకుని పారిపోయాడా? లేక ఎవరైనా అతనికి సహకరించారా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు పది బృందాలు రిమాండ్ ఖైదీకోసం గాలింపు ముమ్మరం చేసాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు. అయితే, రిమాండ్ ఖైదీ తప్పించుకున్న ఘటనపై సీసీ ఫుటేజ్‌లు సేకరించే పనిలో పోలీసు బృందాలు నిమఘ్నమయ్యాయి.

Read Also: AP Legislative Council: మండలిలో మరోసారి మంత్రి లోకేష్ వర్సెస్ బొత్స సత్యనారాయణ..

Exit mobile version