Gorantla Butchaiah Chowdary: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములు అయినవాళ్లు.. అనుకూలంగా వ్యవహరిస్తూ.. వీడియోలు, పోస్టులు పెట్టినవాళ్లు కొందరు.. తాము రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తునట్టు ప్రకటించారు.. కొందరు గత వివాదాల్లో కేసులు ఎదుర్కొంటుండగా.. ఇంకా కొందరు ముందుగానే క్షమాపణలు కోరుతున్నారు.. అయితే, ఈ వ్యవహారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఆర్జీవీ ఈవేళ రాజకీయాలు వదిలేస్తే.. చట్టం వదిలేస్తుందా? అని ప్రశ్నించారు.. సొంత చెల్లినే బయటకు నెట్టేసిన వాడు.. ప్రజలకు ఏమీ చేస్తాడు..? ప్రజలకు ఏమీ చెబుతానని జనంలోకి వస్తాడు..? అంటూ నిలదీశారు.. ఇక, మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు మాజీ బుచ్చయ్య చౌదరి. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో భూకబ్జా దారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు..
Read Also: Bigg Boss 8 Prithviraj Shetty: ఏంటి పృథ్వీరాజ్ విష్ణుప్రియ ప్రేమను అంత మాట అనేసావ్!
ఇక, అదానీ ద్వారా సికి నుంచి విద్యుత్ కొనుగోలులో అవినీతి జరగలేదా.. ? అప్పుడు సీఎంగా వున్నది జగన్ కాదా..? అంటూ ప్రశ్నించారు బుచ్చయ్యచౌదరి.. ఎఫ్ బిఐఎఫ్ఐఆర్ లో జగన్ మీద ఆరోపణలు చేస్తే తన మీద కాదంటారా అంటూ మండిపడ్డారు. వైసీపీలో వున్న దోపిడీ దొoగలను ఎరిపారేస్తామని అన్నారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తప్పుడు ఒప్పందాలపై విచారణ జరుగుతోందన్నారు.. తప్పులుంటే చర్యలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు. తప్పుడు ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిపారు. 25 ఏళ్లలో లక్షా 25 వేల కోట్లు రాష్ట్రానికి నష్టం కల్గుతుందన్నారు. అదానీతో సౌర విద్యుత్ కొనుగోలులో రాష్ట్రానికి అదా చేసానని చెబుతూ సన్మానం చేయాలని అడుగుతావా అంటూ మండిపడ్డారు. ఆర్ధిక విధ్వంసం చేసినందుకు సన్మానించాలా? అని ఫైర్ అయ్యారు.. నాడు సీఎంగా నీవు లేవా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు గంటల్లో సొమ్ము చెల్లించే ఏర్పాటు చేశామని అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినదానికి నువ్వు కారణం కాదా? అని నిలదీశారు.. రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం నిర్మాణాన్ని నిలిపివేయలేదా…? ఏమీ చేశావు అని నీకు సన్మానం..? ఎందుకు చేయాలి అన్నారు. ఎక్కడిక్కడే ప్యాలెస్ లు కట్టుకుని పేదవాడివా.., రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసి వేల కోట్లు తినేస్తున్నారని విమర్శించారు. అధికారులు అలసత్వం వదిలేయాలి.. ఇంకా పాత బాటలోనే వుంటే చర్యలు వుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం తిడితే మేం పడలేదా..? అని ప్రశ్నించారు.. చర్యలు చేపడితే వక్రభాష్యం చెపుతారా అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి య్యచౌదరి..