Ganesh Idols Immersion: ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నది పోటెత్తింది.. దీంతో గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలు నిలిపివేసిన విషయం విదితమే.. రాజమండ్రి వద్దర గోదావరి నదిలో మూడు రోజుల పాటు గణేష్ నిమజ్జనాలు నిలిచిపోగా.. నేటి నుండి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు అధికారులు.. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాజమండ్రిలో మూడు రోజులుగా గణేష్ నిమజ్జనాలు నిలిచిపోయాయి. ఇక, గోదావరిలో వరద ఉధృతి తగ్గడంతో.. గణేష్ నిమజ్జనాలు కోసం పుష్కర్ ఘాట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ర్యాంపులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Also: Gang Rape: మహిళా స్వీపర్‌పై గ్యాంగ్ రేప్.. ఐదుగురు అరెస్ట్
బోటుకు పంటు కట్టి దానిపై గణేష్ విగ్రహాలు క్రేన్ లో ద్వారా ఎక్కించి గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిమజ్జనం విధులకు హాజరు అవుతున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది 2400 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు గోదావరిలో 150 గణేష్ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేశారు. మరోవైపు రేపటి నుండి మూడు రోజుల పాటు భారీగా ఊరేగింపులతో నిమజ్జనానికి గణనాథులు విగ్రహాలు తరలి రానున్నాయి. నిమజ్జనానికి విగ్రహంతోపాటు. ఒక్కరికీ మాత్రమే రేవులోకి అనుమతి ఇస్తున్నారు. గోదావరిలో నిమజ్జనానికి ఊరేగింపులతో వచ్చే వారు మద్యం సేవించి రావద్దని, బాణసంచా కాల్పులు చేయవద్దని. రేవులో వద్ద ఫ్లేక్స్ తో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు పోలీసులు..