Site icon NTV Telugu

Harsha Kumar: బనకచర్ల ప్రాజెక్టుపై హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు..

Harshakumar

Harshakumar

Harsha Kumar: పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా.. ఏపీ ఎలా ఈ ప్రాజెక్టు నిర్మిస్తుందని టీజీ సర్కార్‌ ప్రశ్నిస్తోంది.. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అయితే, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ బనకచర్లపై సంచలన ఆరోపణలు చేశారు.. జేబులు నింపుకోవడానికే 81 వేల కోట్లతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని విమర్శించారు హర్షకుమార్‌. ముందు పోలవరం పూర్తి చేయకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు అంటూ ప్రశ్నించారు. మరోవైపు, రాజధాని అమరావతిలో 90 శాతం భూములు ఖాళీగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ విధానాలు సరిగా లేవని విమర్శించారు. యోగా డే పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్..

Read Also: Sonia Gandhi: ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతపై స్పందించిన సోనియా గాంధీ..

Exit mobile version