Site icon NTV Telugu

CM Chandrababu: రేపు కొవ్వూరు పర్యటనకు సీఎం చంద్రబాబు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనలో.. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో.. శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. కాపవరం హైవే పక్కన హెలీప్యాడ్ సిద్ధం చేశారు.. కాపవరం నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లి చేరుకుని అక్కడ దళితవాడలో పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు..

Read Also: Raja Singh: రాజా సింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై..

ఇక, ఈ పర్యటనలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు పంపిణీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత కాపవరంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.. అనంతరం బయలుదేరి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కాన్వాయ్ ట్రయల్ రన్‌ నిర్వహించారు పోలీసు అధికారులు.. కాగా, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ మొత్తాన్ని పెంచి పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్‌.. ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో.. తప్పనిసరిగా పాల్గొంటూ వస్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version