Bird Flu: తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్ తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూంలో 95429 08025 నెంబర్ తో ఏర్పాటు చేయడం జరిగింది. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలనీ హై అలెర్ట్ జారీ చేశారు.
Read Also: Minister Anam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతాం..
అయితే, ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలనీ పశు సంవర్ధక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల కోళ్ళు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ప్లూ వవ్చిన కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు 144, 133 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించిన వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.