Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: మా నైతికతను ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాదు..!

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: మా నైతికతను ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాని పని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత భూమాన కరుణాకర్‌రెడ్డి.. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎంపీ మిథన్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా.. ములాఖత్‌లో మిథున్‌రెడ్డిని కలిశారు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూమన.. దొంగ నోట్ల, దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమే కాదు అన్నారు.. వైసీపీ నేతలను, కార్యకర్తలను ఛంబల్‌ లోయ దొంగలుగా వెంటాడుతున్నారు.. వైసీపీ నేతలను జైల్లో కుక్కడం ఆనవాయితీగా మరింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేసిన నిజాయితీ అధికారులను, ఆప్తులను కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుంది. ఇటువంటి అరెస్టులకు మేం భయపడబోం.. మా నైతికతను ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు..

Read Also: Medak: భారీ వరదలో బోటు బోల్తా.. మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి తప్పిన పెను ప్రమాదం..

ప్రజలను చైతన్యవంతులు చేస్తూ మళ్లీ మిథున్‌రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తూనే ఉంటాం.. జైల్లో మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు భూమన.. పచ్చి అబద్ధాలతో ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది అని మండిపడ్డారు.. ఇక, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మీద నేను ఎటువంటి కామెంట్లు చేయలేదన్నారు భూమన.. మరోవైపు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా ఈ ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు.. వైసీపీ నేతలను టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.. కాగా, ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో అరెస్ట్‌ అయిన మిథున్‌రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉండగా.. ఈ మధ్యే మరోసారి లిక్కర్‌ స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించిన విషయం విదితమే..

Exit mobile version