తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు కొంత దూరంగా ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఎలా జరిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు లోపించి ఈ సంఘటన జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. నెల రోజులు కాకముందే టెర్మినల్ భవనం పిల్లర్స్ కుప్పకూలాయి.
Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం..
- రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో ప్రమాదం
- కూలిపోయిన నిర్మాణంలో ఉన్న టెర్మినల్ లో కొంత భాగం
- కార్మికులు అంతా సురక్షితం
- ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.