NTV Telugu Site icon

AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

Ap Tg

Ap Tg

AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తెలంగాణలోని హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొత్తగూడెం, చర్ల, ఖమ్మంలోని మణుగూరు సహా పలు చోట్ల భూమి కంపించింది. అదేవిధంగా ఏపీలోని విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, కృష్ణా జిల్లాలో భూమి కంపించింది.. 2 సెకన్ల పాటు కంపించిన భూమి పరిసర గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు.

WI vs Ban: 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత వెస్టిండీస్‌ గడ్డపై గెలిచిన బంగ్లాదేశ్

ఒకవైపు వర్షాలు, చలితో ప్రజలు బయటకు వచ్చేందుకు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు భూకంపంతో బయటకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు.

Show comments