వంగవీటి రంగా చావుకి కారణం తెలుగుదేశం పార్టీయే నని ఆరోపించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. కాకినాడలో నిర్వహించిన వంగవీటి మోహనరంగా 78వ జయంతి వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. ఈ సందర్భంగా శారదమ్మ గుడి వద్ద వంగవీటి రంగా విగ్రహానికి ఎమ్మెల్యే ద్వారంపూడి సహా పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహన రంగా అనే వ్యక్తి ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్న ఆయన.. ఆయన ఒక శక్తి అని పేర్కొన్నారు.. పేదలకు అండగా నిలిచేతత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిపెట్టిందని పేర్కొన్నారు.. ఇక, రంగా చావుకి కారణం టీడీపీ.. ఎన్టీఆర్ సీఎంగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో రంగా మర్డర్ జరిగిందని ఆరోపించారు.. మరోవైపు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ ఎక్కడున్నా నేను అభిమానిస్తాను, రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.
Read Also: PM Modi AP Tour: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం..? క్లారిటీ ఇచ్చిన ఏపీ పోలీసులు