ఏలూరు జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకాతిరుమల చిన వెంకన్న తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుక ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్ట సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హాజరయ్యారయ్యారు. ముందుగా స్వామి, అమ్మవార్ల కళ్యాణం మూర్తులను వేరు వేరుగా కల్యాణ మండపంలో జరిగే వివాహ వేడుక వద్దకు తీసుకువచ్చారు.
Read Also: National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం
స్వామి వారి వివాహ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపంలో రజిత సింహాసనంపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి పుష్పాలంకరణతో అలంకరించారు. అనంతరం హారతులు పట్టి కల్యాణ వేడుకను ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్ యస్వి సుధాకర్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం, కళ్యాణ ఘట్టం , తలంబ్రాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసారు. కల్యాణం అనతరం స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో దేవస్థానం అధికారులు వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Read Also: Anti-Hijab Protest: రోజురోజుకు తీవ్రమవుతోన్న హిజాబ్ వ్యవహారం.. పాఠశాల విద్యార్థులు అరెస్ట్