Site icon NTV Telugu

శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ల కలకలం

Srisailam

Srisailam

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి… శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్‌ కెమెరాలు చక్కర్లు కొట్టినట్టు చెబుతున్నారు.. డ్రోన్ల కదలికలను గుర్తించిన పోలీసులు, ఆలయ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి చిక్కలేదు.. అయితే, నాలుగు రోజులుగా రాత్రిపూట ఆలయ పరిసరాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు… అర్ధరాత్రి పూట డ్రోన్లు తిరగడంతో శ్రీశైలంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, భక్తులు.. కాగా, గత కొంతకాలంగా భారత్‌-పాకిస్థాన్‌ బోడర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తుండగా.. కొన్నింటిని సైన్యం పేల్చివేసింది.. తాజాగా, జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడికి పాల్పడడం, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని భారత ఎంబసీ పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలోకి ఎగరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే, సమయంలో.. శ్రీశైలంలో అనుమానాస్పద డ్రోన్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Exit mobile version