Site icon NTV Telugu

Dokka Manikya Vara Prasad: కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరితే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా ఓట్లు వేయరు..!

Dokka Manikya Vara Prasad

Dokka Manikya Vara Prasad

Dokka Manikya Vara Prasad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా కూడా చేశారు.. అయితే, ఆయన చేరికను బీజేపీ నేతలు ఆహ్వానిస్తుంటే.. ఆయనపై మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం వలన వారికి ఒక్క ఓటు మాత్రమే వస్తుందని.. కిరణ్ కుమార్ రెడ్డికి వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా ఓట్లు వేయరంటూ ఎద్దేవా చేశారు.. అలాంటి నాయకుడిని బీజేపీలో చేర్చుకోవడం వలన ఎలాంటి ఉపయోగం లేదన్న డొక్కా.. ప్రతిపక్షలు ఓటమిని అంగీకరించలేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు అంటూ ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎన్నికల ప్రకియ స్వతంత్ర వ్యవస్థ కలిగిన ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా నిర్వహిస్తుందన్నారు.. మరోవైపు.. ఒంటి మిట్ట రామాలయంలో జాంబవంతుడి విగ్రహాని టీటీడీ ఏర్పాటు చేయాలని కోరారు డొక్కా మాణిక్యవరప్రసాద్‌.

Read Also: Minister Seediri: విశాఖే రాజధాని నో డౌట్.. సీఎం జగన్ గొప్ప పాలసీ

కాగా, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాశారు కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆయన బీజేపీలో చేరతారంటూ ఇటీవల ప్రచారం సాగగా.. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో ఆ ప్రచారానికి బలం చేకూరినట్టు అయ్యింది. ఇక, కిరణ్‌ కుమార్‌రెడ్డి.. బీజేపీలోకి వస్తున్నారన్న ప్రచారంపై ఈ మధ్య స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.. కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు అని, పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని.. అలాంటి నేత వస్తే, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించిన విషయం విదితమే.

Exit mobile version