NTV Telugu Site icon

YS Jagan: చెన్నైలో దక్షిణ భారత అఖిలపక్ష సమావేశం.. వైఎస్ జగన్కు ఆహ్వానం..

Ys Jagan

Ys Jagan

YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని తమిళనాడుకు చెందిన పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్‌ కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు.

Read Also: UP CM Yogi: ఔరంగజేబుని ఆరాధించే వారు, షాజహాన్ గతిని ఎదుర్కోవాలి..

ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్ కి అందజేసి.. సమావేశానికి రావాలని డీఎంకే నేతలు ఆహ్వానించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. ఇందులో భాగంగా తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్‌ జగన్‌ను కలిశారు. అయితే, లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు.