కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం నెలకొంది.. కృష్ణానదిలో ప్రయాణికులను సంగమేశ్వరానికి తరలించే విషయంలో రెండు రాష్ట్రాలకు చెందిన బోటు నిర్వాహకుల మధ్య ఈ తాజా వివాదం చోటు చేసుకుంది.. నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.. కృష్ణానది మధ్యలోనే పడవలపై కొట్టుకోవాడానికే సిద్ధమయ్యారు ఇరు రాష్ట్రాల బోటు నిర్వాహకులు.. తెలంగాణ బోట్లను సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకే నడపాలన్నారు ఏపీ బోటు నిర్వాహకులు.. సంగమేశ్వరం గుడికి రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఇరు రాష్ట్రాలకు చెందిన బోట్ల యజమానులు గొడవకు దిగారు. ఇప్పటికే ఈ విషయంపై ఆత్మకూరు తహసీల్దార్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.. ఈ వివాదం సద్దుమనిగే వరకు ఇరు రాష్ట్రాలవారు ఎవరూ పడవల తిప్పకూడదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.. దీంతో, సంగమేశ్వరం ట్రిపిక్‌కు బ్రేక్‌లు పడినట్టు అయ్యింది..
Read Also: Jogi Ramesh: మరణాలకు కారణమైనవారిపై చర్యలు.. చంద్రబాబును అరెస్టు చేస్తాం..!
కాగా, కర్నూలు జిల్లా.. ప్రస్తుత నంద్యాల జిల్లాలో ప్రసిద్ధి చెందిన సప్తనదీ సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలో ఓలలాడుతున్నారు. భారత దేశంలోనే 7 నదులు సంగమించే ప్రదేశం సంగమేశ్వరం. అంతే కాదు.. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం సంగమేశ్వరాలయం.. వేల సంవత్సరాల చరిత్ర ఉండి.. ఎందరో మునులు తపస్సుచేసిన ప్రదేశం సంగమేశ్వరం.. నల్లమల ఆటవీక్షేత్రం ఒకవైపు, ఏడు నందుల సంగమించే పవిత్ర ప్రదేశం మరోవైపు.. అదే సంగమేశ్వరం క్షేత్రం. భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే 7 నదులు ఒకచోట కలిసే ప్రదేశం ఎక్కడా లేదు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు సంగమించే ప్రదేశమే సంగమేశ్వరం. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుష నది, మిగిలినవన్నీ స్ర్రీ నదులు. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి. సంగమేశ్వరాలయానికి చేరుకోవాలంటే ఆత్మకూరు నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. తెలంగాణ నుంచైతే సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటారు. అయితే, తాజా వివాదంతో ఇప్పుడు సంగమేశ్వరానికి వెళ్లకుండా బ్రేక్‌లు పడ్డాయి.