Site icon NTV Telugu

CM Jagan: సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ.. కారణం ఇదేనా?

Ram Gopal Varma

Ram Gopal Varma

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం అయ్యారు. అమరావతి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఆయన్ను వర్మ కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు వర్మకు సీఎం జగన్ లంచ్ ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు జగన్, రామ్‌గోపాల్ వర్మ సమావేశం సాగింది. అనంతరం జగన్ నివాసం నుంచి వర్మ బయటకు వచ్చారు. అయితే జగన్‌తో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం కావడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Read Also: AHA: ‘అందరూ బాగుండాలి…’ టీజర్, ట్రైలర్ విడుదల

అయితే వీళ్లిద్దరూ ఎందుకు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో త్వరలో మూడు రాజధానుల అంశం లేదా చంద్రబాబు వెన్నుపోటు అంశంపై వర్మ సినిమా తీసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మరోవైపు ఏపీలో సినిమా రంగానికి సంబంధించి పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా గతంలో సినిమా టికెట్ల వివాదంలో మంత్రి పేర్నినానితో ఆర్జీవీ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే.

Read Also: Vijaya Sai Reddy: బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు ఇవ్వాలి

Exit mobile version