NTV Telugu Site icon

Director Prashanth Neel: దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. రఘువీరారెడ్డి భావోద్వేగం

Prashanth Neel

Prashanth Neel

సొంత ఊరికి కొంతైనా మేలు చేయాలని చెబుతుంటారు.. దేశానికి రాజైనా అమ్మకు కొడుకే.. కన్నతల్లిని, సొంత ఊరిని మరవకూడదు అని చెబుతుంటారు.. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించి టాప్‌ గేర్‌ వేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను సైతం షేక్‌ చేయడమే కాదు.. తన సొంత ఊరి ప్రజల అభినందనలు అందుకుంటున్నాడు.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎవరో కాదు.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం.. తాజాగా ఆ గ్రామంలో పర్యటించిన ప్రశాంత్‌ నీల్.. భారీ విరాళాన్ని అందించారు.

Read Also: Independence Day Politics :: ఎగిరే జెండా సాక్షిగా విమర్శలు-ప్రతివిమర్శలు..

అయితే, నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.. ఆ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు సాయంగా రూ. 50 లక్షల విరాళాన్ని ఇచ్చారు ప్రశాంత్‌ నీల్. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రఘువీరారెడ్డి… నీలకంఠాపురం గ్రామస్తులందరికీ ఇది ఎంతో గర్వించే సందర్శమంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్న ఆయన.. ప్రశాంత్ నీల్‌.. తన తండ్రి సుభాష్ రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విరాళాన్ని అందించారని తెలిపారు.. సరిగ్గా మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే అంటే 1947 ఆగస్టు 15న.. తన సోదరుడు సుభాష్ రెడ్డి జన్మించారని గుర్తుచేసుకున్నారు.. అయితే, ఆయన కన్నుమూశారు.. తన తండ్రి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా నీలకంఠాపురంలో పర్యటించిన ప్రశాంత్ నీల్.. ఆ గ్రామంలో రఘువీరారెడ్డి నేతృత్వంలో నిర్మించిన ఆలయాలను కూడా సందర్శించారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాగా, ఏపీ రెండుగా విడిపోయి.. నవ్యాంధ్రలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రఘువీరారెడ్డి.. ఆ తర్వాత సొంత ఊరికే పరిమితం అయ్యారు.. ఆలయాల నిర్మాణంపై దృష్టిపెట్టారు.. తన మనవరాలితో పొలాల్లో.. బావుల్లో సరదాగా గడుపుతూ.. ఎప్పటిప్పుడు ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే.