Director Prashanth Neel: దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. రఘువీరారెడ్డి భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత ఊరికి కొంతైనా మేలు చేయాలని చెబుతుంటారు.. దేశానికి రాజైనా అమ్మకు కొడుకే.. కన్నతల్లిని, సొంత ఊరిని మరవకూడదు అని చెబుతుంటారు.. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించి టాప్ గేర్ వేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ ను సైతం షేక్ చేయడమే కాదు.. తన సొంత ఊరి ప్రజల అభినందనలు అందుకుంటున్నాడు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరో కాదు.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం.. తాజాగా ఆ గ్రామంలో పర్యటించిన ప్రశాంత్ నీల్.. భారీ విరాళాన్ని అందించారు.
Read Also: Independence Day Politics :: ఎగిరే జెండా సాక్షిగా విమర్శలు-ప్రతివిమర్శలు..
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
అయితే, నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.. ఆ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు సాయంగా రూ. 50 లక్షల విరాళాన్ని ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రఘువీరారెడ్డి… నీలకంఠాపురం గ్రామస్తులందరికీ ఇది ఎంతో గర్వించే సందర్శమంటూ సోషల్ మీడియాలో పేర్కొన్న ఆయన.. ప్రశాంత్ నీల్.. తన తండ్రి సుభాష్ రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ విరాళాన్ని అందించారని తెలిపారు.. సరిగ్గా మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే అంటే 1947 ఆగస్టు 15న.. తన సోదరుడు సుభాష్ రెడ్డి జన్మించారని గుర్తుచేసుకున్నారు.. అయితే, ఆయన కన్నుమూశారు.. తన తండ్రి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా నీలకంఠాపురంలో పర్యటించిన ప్రశాంత్ నీల్.. ఆ గ్రామంలో రఘువీరారెడ్డి నేతృత్వంలో నిర్మించిన ఆలయాలను కూడా సందర్శించారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కాగా, ఏపీ రెండుగా విడిపోయి.. నవ్యాంధ్రలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రఘువీరారెడ్డి.. ఆ తర్వాత సొంత ఊరికే పరిమితం అయ్యారు.. ఆలయాల నిర్మాణంపై దృష్టిపెట్టారు.. తన మనవరాలితో పొలాల్లో.. బావుల్లో సరదాగా గడుపుతూ.. ఎప్పటిప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
A proud&happy moment for me and to the villagers of Neelakantapuram as my nephew @prashanth_neel for his heart warming contribution of 50lakhs towards the construction of LV Prasad Eye Hospital in our Neelakantapuram on the 75th birth anniversary(15/08/1947)of his father Subhash. pic.twitter.com/UbAVtZWGnu
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 15, 2022
నీలకంఠాపురం దేవస్థానములు సందర్శించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న ప్రముఖ దర్శకుడు రఘువీరారెడ్డి గారి అన్న కుమారుడు @prashanth_neel pic.twitter.com/uggpSGFe7j
— NKP Devasthanams (@nkpdevasthanam) August 15, 2022
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి