Site icon NTV Telugu

TDP vs TDP: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు

Tdp

Tdp

TDP vs TDP: అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ ద్విసభ్య కమిటీ మెంబర్లు తన తండ్రిని దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బండారు శ్రావణి. నిన్న మర్తాడు గ్రామంలో యువగళం క్యాంప్ సెట్ దగ్గర బండారు శ్రావణి.. ముంటి మడుగు కేశవ రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో తన తండ్రి బండారు రవికుమార్ ను దూషించి దాడి చేశారంటూ ద్విసభ్య కమిటీ సభ్యుడు సోదరుడు శ్రీనివాసరెడ్డిపై శ్రావణి ఫిర్యాదు చేశారు. దీంతో గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో ముంటి మడుగు శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నియోజకవర్గంలో యువగళం పాద్రయాత్ర కొనసాగుతున్న సమయంలో విభేదాలు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Read Also: SRH vs LSG: ఆడుతూ పాడుతూ లాగించేస్తున్న లక్నో.. 10 ఓవర్లలో స్కోరు ఇది

Exit mobile version