Sangam Dairy: జీడీసీసీ అక్రమాలపై కలెక్టర్ కు ధూళిపాళ్ళ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో సమావేశం అయ్యారు. జీడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను నివేదించారు. వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అక్రమాల్లో బ్యాంకుతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందన్నారు.
రూ.కోట్లలో బ్యాంకు సొమ్ము స్వాహా అయిందని, ఈ వ్యవహారంపై సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలన్నారు. వైసీపీ ముఖ్యనేత బంధువైన కారుమూరి అశోక్‌రెడ్డి, మాచవరం తహసీల్దార్ హన్మంతరావు పలు అక్రమాల్లో ముఖ్యపాత్ర ఉందని ధూళిపాళ్ళ ఆరోపించారు. వీరిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని బ్యాంకు బ్రాంచీలు, సంఘాలలో మాత్రమే బోగస్ రుణాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలా కాకుండా 167 సంఘాలన్నింటిని విచారణ జరిపితే అసలు ఎంత సొమ్ము దుర్వినియోగమైంది, దోషులు ఎవరు అనే విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.
Also Read
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
బ్యాంకుకు చెందిన 42 బ్రాంచీలలోనూ తనిఖీలు నిర్వహించాలన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు వైసీపీ వచ్చిన తర్వాత దాని ప్రతిష్ట స్కామ్‌ల ద్వారా మసకబారుతోండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. డ్వాక్రా గ్రూపులకు ఈ రెండేళ్లలో ఇచ్చిన రూ.850 కోట్ల రుణాల్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. బినామీ గ్రూపుల పేరుతో రూ.లక్షలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. ఈ వ్యవహారాలపై నిష్పాక్షికంగా దర్యాప్తు సాగించాలన్నారు.
తాజావార్తలు
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!