NTV Telugu Site icon

Dharmana Krishna Das: ఎవరైనా డబ్బు, పేరు కోసం రాజకీయాల్లోకి వస్తారు.. కానీ, జగన్‌..!

ఎవరైనా డబ్బు, పేరు కోసం రాజకీయాల్లోకి వస్తారు.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ వేరు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌.. మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పార్టీ బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ధర్మాన.. పరీక్షా సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.. అధ్యక్ష బాధ్యతల్లో నియమించిన జగనన్నకు కృతజ్ణతలు తెలిపారు.. ఇక, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలన్నారు.. ప్రతి ఓటును దక్కించుకునేలా వైసీపీ నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. దిశా చట్టం అమల్లో ఉందా?

ఇక, కార్యకర్తల్లో అసమ్మతి ఉంది.. ఇకపై పార్టీ అభివృద్ధికోసం అంతా కృషి చేయాలని సూచించారు ధర్మాన.. గతంలో జరిగిన ఇబ్బందులు భవిష్యత్‌లో ఉండవు‌.. కలసికట్టుగా పనిచేద్దాం అన్నారు.. ఎవరైనా డబ్బు , పేరుకోసం రాజకీయాల్లోకి వస్తారు.. కానీ, డబ్బు, పేరు రెండూ ఉన్నా జగన్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.. కార్యకర్తల కష్టంతో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారన్నారు.. మరోవైపు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై సెటైర్లు వేశారు ధర్మాన కృష్ణదాస్… పార్టీలేదు ఏమీలేదు‌ అన్న అచ్చెన్నాయుడు.. టీడీపీ 161 స్థానాలు గెలుస్తుంది అంటున్నారు.. అది టీడీపీలో మనో నిబ్బరం పెంచేందుకే అంటూ ఎద్దేవా చేశారు ధర్మాన కృష్ణదాస్‌.

Show comments