NTV Telugu Site icon

Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Shivaratri

Shivaratri

Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌ గౌలిపురా మిత్రాక్లబ్‌లో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. 25 నుంచి మార్చి 1 వరకు జ్యోతిర్లింగాలు దర్శనమివ్వనున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉచిత ధ్యాన శిబిరంతో పాటు ఆధ్యాత్మిక ప్రదర్శన నిర్వహించారు.

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం, మేడ్చల్ జిల్లా కీసరగుట్ట, శ్రీశైలం, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కోటగూలు జిల్లా, రామప్పలోని కాళేశ్వర-ముక్తిశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్‌ లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్నాయి.

వరంగల్ జిల్లా వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రుద్రాభిషేకంతో ప్రారంభమై ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. వేయిష్టంబాల ఆలయంతో పాటు ఖమ్మంజిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. కాకతీయుల కాలం నాటి కూసుమంచి శివాలయం దక్షిణ భారతదేశంలోనే మూడవ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

నల్గొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలం వాడపల్లి శైవాయం, నల్గొండలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం శివరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే శివనామంతో మారుమోగుతోంది. శివాలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read also: Lord Shiva Sahasranama Stotram: శివరాత్రి పర్వదినాన ఈస్తోత్రాలు వింటే మృత్యుభయం తొలగిపోతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి పది గంటల సమయం పడుతుంది. సుమారు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రాత్రి 10.30 గంటలకు పాదాలంకరణ అనంతరం స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

హరహర శంభో మంత్రోచ్ఛారణలతో దక్షిణ కాశీ మారుమోగుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి అమ్మవార్ల సేవలో స్నానాలు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. చిత్తూరు జిల్లా కమ్మసంద్రలోని శ్రీకోటి లింగేశ్వరాలయం ఆధ్యాత్మిక సౌందర్యంతో శోభిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. 108 అడుగుల మహా శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహా శివరాత్రి సందడి మొదలైంది. తిరునాళ్లకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో విద్యుత్ ప్రభాస్ కోటప్ప కొండకు బయలుదేరాడు. నరసరావుపేట మండలం గురవాయిపాలెంలో హరహరో కోటయ్య, చేదుకో కోటయ్య అంటూ కొండపైకి విద్యుత్ దీపాలు వెలిశాయి. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కొత్త రూట్లు ఏర్పాటు చేశామన్నారు. వినుకొండ, నరసరావుపేట నుంచి కొండ వెళ్లే ఆర్టీసీ బస్సులు పెట్లూరివారి పాలెం మీదుగా, కొండ నుంచి వినుకొండ వెళ్లే బస్సులు పమిడిమర్రు, జేఎన్‌టీయూ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పంచారామాలు శ్రీక్షీరరామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీసోమేశ్వర జనార్థనస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు. శివుడికి బిల్వార్చన పూజ, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలు, నీటి పందిళ్లు, ప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు.

శివరాత్రి సందర్భంగా పవిత్ర గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగింది. విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన శివభక్తులతో రాజమండ్రి రద్దీగా మారింది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు గోదావరి జెట్టీలకు పోటెత్తడంతో రాజమహేంద్రవరంలోని కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, వీఐపీఘాట్, మార్కెండేయస్వామి రేవు, ఇసుక రేవులు భక్తులతో కిటకిటలాడాయి.

మరోవైపు కోటగుమ్మంలోని శివాలయంతోపాటు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచరామక్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీక్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Maha Shivaratri 2023 Celebrations Live: మహా శివరాత్రి శుభవేళ ప్రసిద్ధ క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం

Show comments