మామిడిపల్లి శని శక్తిధామం.. ముక్తిప్రదాయకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ముఖ్యమయిన స్థానం వుంది. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకరరాశి, కుంభరాశులకు అధిపతి అని చెబుతారు. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుందంటారు. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని బంగారంలా మెరిసేలా చేస్తుంది. భక్తితో శనీశ్వరుడిని ప్రార్ధిస్తే సేవల ద్వారా స్వామి వారిని శాంతింపజేస్తే ఈతిబాధలుండవు.సూర్య పుత్రుడు కాబట్టి శనీశ్వరుడు కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలిగి వుంటాడు. అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగవు.
శనివారం అందునా గ్రహణం నాడు శనీశ్వరుడిని పూజించడం ఎంతో శుభదాయకం. హైదరాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో శని శక్తి ధామం వుంది. అక్కడికి వేలాదిమంది భక్తులు వెళుతుంటారు. ఇవాళ శనివారం కావడంతో మామిడిపల్లిలోని శని శక్తిధామం భక్తులతో నిండిపోయింది. దేశంలోనే ఈ శక్తి ధామం అత్యంత పెద్దదని చెబుతారు. ఇక్కడ శని విగ్రహం 20 అడుగుల మేర వుంటుంది. ఇదంతా ఏకశిల. శని త్రయోదశి, శని అమావాస్య, శని జయంతి నాడు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు.
Also Read
- Mission Godavari Clean Project: మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం
- YS Jagan For Aqua Farmers: రైతుల కోసం మరో ఉద్యమానికి జగన్ సిద్ధం.. ప్రభుత్వానికి డెడ్‌లైన్
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. శనికి తైలాభిషేకం చేస్తారు. ఇలా చేస్తే తమ బాధలు తొలగిపోతాయంటారు. పూజలో 10వేలమంది పాల్గొంటారు. శనిభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలవారు శని శక్తిధామం సందర్శించారు.
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్‌తో బరిలోకి..
-
Earthquake: చైనా, జపాన్‌లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
-
Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
-
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
-
Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?