NTV Telugu Site icon

Gangamma Jatara: కనుల పండువగా గంగమ్మ జాతర

Jataranew

Jataranew

తిరుమలలో కన్నుల పండుగగా గంగమ్మ జాతర | Ntv

రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

ఈ జాతర బుధవారం బుధవారం నుంచి ప్రారంభం కాగా.. తొమ్మిది రోజుల పాటు ఈ జాతర నిర్వహించనున్నారు. రోజుకో వేషంలో భక్తులు కనిపిస్తారు.  ఏటా చైత్రమాసం చివరిరోజు ఈ జాతర నిర్వహిస్తారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తొలి సారెను సమర్పించారు. భూమన కుటుంబ సభ్యులకు ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. గతరెండేళ్లుగా జాతర ఏకాంతంగానే నిర్వహించారు.

కరోనా వల్ల జాతర సందడి లేకుండా పోయిందని.. ఈ ఏడాది అంతా బాగుందని, అమ్మవారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందంటున్నారు తిరుపతి వాసులు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొమ్మిది వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోందని తిరుపతి వాసులు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కి చెల్లెలుగా అమ్మవారికి స్వామి సారె అందుతుంది. జాతర ప్రారంభం నాడే వర్షం పడింది. ఇది ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి సంకేతం అంటున్నారు.

జాతర సదర్భంగా టీటీడీ అధికారులు సారెను అందిస్తారు. జాతర నాలుగోరోజున టీటీడీ అర్చకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుట్టింటి సారె అందజేస్తారు. పూర్వం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకునేవారు. అలా చేస్తే తిరుపతి యాత్ర సంపూర్ణం అవుతుందని, చెల్లెలిని కొలిచే వచ్చేవారిని శ్రీవారు కరుణిస్తారని నమ్మకం. తాతయ్య గుంట గంగమ్మకు సారె ను సమర్పించనున్నారు మంత్రులు రోజా, నారాయణ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి.

 

Show comments