Devineni Uma: అంబటికి కౌంటర్.. ఫేక్ ట్వీట్లను సృష్టించి ఆరోపణలు చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య వార్ కొనసాగుతోంది. పొత్తులపై పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసి డిలీట్ చేశానన్న మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వమే స్వయంగా ఫేక్ ట్వీట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు తెలిసే సజ్జల డైరెక్షన్‌లో ఫేక్ ప్రచారం జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు. కులాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రభుత్వమే ఫేక్ ప్రచారానికి దిగిందని విమర్శలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఫేక్ ప్రచారం పుడుతోందని దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశారు.
ఫేక్ ట్వీట్లను సృష్టించి దాన్ని మళ్లీ బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు తనను ట్యాగ్ చేయడాన్ని దేవినేని ఉమ ఖండించారు. వైసీపీలో ఉన్న వాళ్లు ఫేక్ ఫేలోస్ అని అభివర్ణించారు. బుద్ధి లేని రాంబాబు.. డయాఫ్రం వాల్ రాంబాబు ఇప్పుడు ఫేక్ ట్వీట్ల రాంబాబుగా మారారని చురకలు అంటించారు. ఫేక్ ట్వీట్‌పై, దాన్ని ట్యాగ్ చేసిన అంబటిపై రేపు సీఐడీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మంత్రి అంబటి రాంబాబును విచారించే ధైర్యం సీఐడీ పోలీసులకు ఉందా అని దేవినేని ఉమ సవాల్ విసిరారు. అర్థరాత్రి టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు నోటీసులిచ్చినట్టే అంబటి రాంబాబుకు నోటీసులివ్వగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఫేక్ ప్రచారం చేశారని.. ఇప్పుడూ ఫేక్ ప్రచారంతోనే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. మహానాడు విజయవంతం కావడంతో ఓర్వలేక వైసీపీనే స్వయంగా ఫేక్ ప్రచారానికి తెర లేపిందన్నారు.
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
పోలవరం పై సవాల్ కు సమాధానం చెప్పలేక ఫేక్ ట్వీట్ ను ట్వీట్ చేసాడంటే మంత్రిగా మీ @AmbatiRambabu పరిజ్ఞానం ఏంటో తెలిసిందా? @ysjagan దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? https://t.co/fM9ZKO1GjV
— Devineni Uma (@DevineniUma) June 6, 2022
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!