Site icon NTV Telugu

Devineni Uma: అంబటికి కౌంటర్.. ఫేక్ ట్వీట్లను సృష్టించి ఆరోపణలు చేస్తారా?

Devineni Uma

Devineni Uma

ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య వార్ కొనసాగుతోంది. పొత్తులపై పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసి డిలీట్ చేశానన్న మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వమే స్వయంగా ఫేక్ ట్వీట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌కు తెలిసే సజ్జల డైరెక్షన్‌లో ఫేక్ ప్రచారం జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు. కులాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రభుత్వమే ఫేక్ ప్రచారానికి దిగిందని విమర్శలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఫేక్ ప్రచారం పుడుతోందని దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశారు.

ఫేక్ ట్వీట్లను సృష్టించి దాన్ని మళ్లీ బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు తనను ట్యాగ్ చేయడాన్ని దేవినేని ఉమ ఖండించారు. వైసీపీలో ఉన్న వాళ్లు ఫేక్ ఫేలోస్ అని అభివర్ణించారు. బుద్ధి లేని రాంబాబు.. డయాఫ్రం వాల్ రాంబాబు ఇప్పుడు ఫేక్ ట్వీట్ల రాంబాబుగా మారారని చురకలు అంటించారు. ఫేక్ ట్వీట్‌పై, దాన్ని ట్యాగ్ చేసిన అంబటిపై రేపు సీఐడీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మంత్రి అంబటి రాంబాబును విచారించే ధైర్యం సీఐడీ పోలీసులకు ఉందా అని దేవినేని ఉమ సవాల్ విసిరారు. అర్థరాత్రి టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు నోటీసులిచ్చినట్టే అంబటి రాంబాబుకు నోటీసులివ్వగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఫేక్ ప్రచారం చేశారని.. ఇప్పుడూ ఫేక్ ప్రచారంతోనే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. మహానాడు విజయవంతం కావడంతో ఓర్వలేక వైసీపీనే స్వయంగా ఫేక్ ప్రచారానికి తెర లేపిందన్నారు.

Exit mobile version