NTV Telugu Site icon

రాజమండ్రి జైల్లో ఉండటానికి నేను సిద్ధం..

Devineni Uma

రైతుల తరపున రాజమండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉండటానికి నేను సిద్ధం అన్నారు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. ఇవాళ మ‌రోసారి సీఐడీ విచారణకు హాజరైన ఆయ‌న‌.. అంత‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జే టాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.. సమయం అంతా దేవినేని ఉమను, ధూళిపాళ్ల‌ నరేంద్రని ఇబ్బంది పెట్ట‌డానిఇ వెచ్చిస్తున్నార‌న్న ఆయ‌న‌.. దేవినేని ఉమను 9 గంటలు సీఐడీ కార్యాలయంలో కూర్చోబెడితే ఏమి వస్తుంది? అంటూ మండిప‌డ్డారు.. ధాన్యం పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే సీఎం వైఎస్ జ‌గ‌న్‌ ఎందుకు స్పందించడం లేద‌ని ప్ర‌శ్నించిన దేవినేని.. మంత్రులు ధాన్యం దళారుల దోసుకుంటుంటే సీఎం నిద్ర‌పోతున్నారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధాన్యం దోపిడీపై నాపై ఏ కేసు పెడతారో పెట్టుకోండి.. రైతుల తరపున రాజమండ్రి జైల్లో ఉండటానికి నేను సిద్ధం అన్నారు దేవినేని. మ‌రోవైపు.. గ‌త విచార‌ణ‌లో 9 గంట‌ల‌కు పైగా దేవినేనిని ప్ర‌శ్నించింది సీఐడీ.. ఆ త‌ర్వాత మాట్లాడుతూ.. చంద్ర‌బాబు పేరు చెబితే మ‌ధ్యాహ్న‌మే వ‌దిలేస్తామ‌న్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.