AP Deputy Speaker: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ఏమంటివి.. ఏమంటివి.. అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్‌తో ఆర్ఆర్ఆర్ ఏకపాత్రాభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా సభ్యులు అందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కేరింతలతో సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా మార్మోగింది. తమ తమ స్థానాల్లో నిల్చొని రఘు రామకృష్ణ రాజుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు, పవన్‌తో పాటు మంత్రులు చప్పట్లతో అభినందించారు.
Read Also: RG Kar protests: “ఆర్‌జీ కర్” నిరసనల్లో పాల్గొన్న డాక్టర్‌పై మమతా సర్కార్ ప్రతీకారం..
అలాగే, ఈశ్వరరావు, విజయ్ కుమార్ స్కిట్ జరుగుతున్నంత సేపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు సభా ప్రాంగణంలోని సభ్యులు కడుపుబ్బ నవ్వారు. వీరితో పాటు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఇతర ఎమ్మెల్యేల స్కిట్ లో.. కొస్తే పచ్చరక్తం వస్తుంది.. లోకేష్ పాదయాత్రలో నా కొడుకున్నాడు.. ఇంజనీరింగ్ కాలేజీలు మన నాయకులవే సీటు ఇవ్వారా.. AI అని పెద్దాయన చెప్పాడు.. అందులో సీటు కావాలి.. ఇంటర్ తప్పినా సీటు కావాల్సిందే.. లోకేష్ మెరిట్ అంటాడు.. మళ్ళీ ఇంటర్ రాయాలి అంటూ జోకులు వేశారు.