Site icon NTV Telugu

Deputy Cm Rajanna Dora: పవన్ రాజకీయాలు చంద్రబాబు కోసమే

Rajanna Dora

Rajanna Dora

విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడులు చేయడాన్ని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రుల పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఎన్టీఆర్‌, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానిని.. కానీ పవన్ మీద ఉన్న అభిమానాన్ని ఈ ఘటనతో పోగొట్టుకున్నాడని అన్నారు రాజన్నదొర. పవన్ తన కార్యకర్తలని క్రమశిక్షణ లో పెట్టుకోలేపోతున్నారని మండిపడ్డారు.. జన సైనికులలో క్రమశిక్షణ లేక పోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయామని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

పవన్ కల్యాణ్ తన కోసం రాజకీయాలు చెయ్యడం లేదు చంద్రబాబు కోసమే చేస్తున్నాడని రాజన్నదొర విమర్శించారు. ఉత్తరాంధ్రలో రాజధానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన మంత్రుల మీద రాళ్ళ దాడి హేయమైన చర్యగా భావిస్తున్నానని అన్నారు.పవన్ తన కార్యకర్తలని అదుపులో పెట్టుకోవాలి. ఇది ఇంతటి తో ముగిసిపోయేది కాదని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై చర్యలు ఉంటాయని.. శాంతిభద్రతలకు భంగం కలిగించినవారు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు డిప్యూటీ సీఎం రాజన్నదొర.

విశాఖపట్నం పరిపాలన రాజధాని నిర్ణయానికి మద్దతుగా వైసీపీ ర్యాలీ నిర్వహించింది. వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజా సంఘాల నాయుకులు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Read also: Deepika Padukone: ప్రపంచంలో టాప్-10 అందగత్తెల్లో దీపికా పదుకొనె

Exit mobile version