మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు.. ఎందుకు పవన్ ఈ మాట పదే పదే చెబుతున్నారు. దీని వెనక ఉద్దేశం ఏంటి..? కొన్ని అంశాల్లో వచ్చిన విభేదాల వల్ల ఈ మాట చెబుతున్నారా.. లేక వైసీపీ బలపడకూడదు అనే ఉద్దేశం ఉందా..? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతోంది. కూటమి ఏర్పాటులో పవన్ పాత్ర చాలా కీలకం. అందులో ఎలాంటి డౌట్స్ లేవు కానీ.. ఈ మధ్య పవన్ కొన్ని సందర్భాల్లో కూటమి 15 ఏళ్ళు ఉండాలి.. అసలు విడిపోకూడదు అనే మాట చెబుతున్నారు.. దీనికి ప్రధాన కారణం కూటమి నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కారణంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ కూటమి ప్రభుత్వంపై మొదట వ్యతిరేక స్వరం వినిపించింది పవన్ కల్యాణే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో లేదని.. నేనే హోంమంత్రి అయితే వేరే ఉంటుందని.. తర్వాత టీటీడీ తొక్కిసలాట అంశంలో కూడా అధికారుల తీరును పోలీసుల తీరును తప్పు పట్టారు. పాత వాసనలు పోవడం లేదు అన్నారు. తిరుపతిలో పవన్ వైఖరి టీడీపీ నేతల్లో కొంత అసహనం కలిగించింది.. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది.
Read Also: JSW MG: దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ.. కొత్త వేరియంట్ వచ్చేసిందోచ్..
పవన్ టీటీడీ విషయంలో క్షమాపణలు అడగడం.. సీఎం చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట పరామర్శలకు వెళ్లినప్పుడే పవన్ కూడా వెళ్లడం టీడీపీ శ్రేణులను కొంత ఇబ్బంది పెట్టింది.. అక్కడ నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అనే టాక్ స్టార్ట్ అయింది.. ఇది పీక్ కు వెళ్ళింది. ఈ అంశం పవన్ కల్యాణ్‌కు ఇబ్బంది కలిగించింది.. తర్వాత కొన్ని అధికారిక కార్యక్రమాలకు రాకుండా పవన్ దూరంగా ఉన్నారు. వెన్ను నొప్పి వల్ల రాలేదని తర్వాత చెప్పారు.. అది వేరే విషయం. డిప్యూటీ సీఎం లోకేష్ అంటూ టీడీపీ శ్రేణులు చేసిన ప్రచారాన్ని జనసేనకు, పవన్ కు అసహనం కలిగించాయి. కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం బాగా జరిగింది.
Read Also: Sanjay Dutt: సాయి ధరమ్ తేజ్ కోసం సంజయ్ దత్?
కూటమి కలిసే ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఒక దశాబ్దం కూటమి ఉంటుందని పవన్ అనేవారు.. కానీ అప్పుడు అది జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పుడు కలిసే ఉంటాం అని చెప్పకపోతే ఈ మధ్య వచ్చిన విభేదాల వల్ల కార్యకర్తల్లో, కూటమి నేతల్లో ప్రజల్లో సందేహం వస్తుందని ముందు జాగ్రత్తగా చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి వేరేలా ఉంది. అవన్నీ సెట్ రైట్ చేయడానికే పవన్ పదేపదే కలిసే ఉంటాం అని చెబుతున్నారు. ఈ మధ్య అసెంబ్లీకి రాని వైసీపీ కూడా సమావేశాలకు వచ్చి ఆందోళన చేసింది. దీంతో జగన్ బలపడే అవకాశం ఉందని కూడా పవన్ గ్రహించారు. నిన్న అసెంబ్లీలో కూడా పవన్ ఇదే విషయం చెప్పారు. కేవలం11 మందితోనే ఇంత గొడవ చేశారు. ఇంకా కొద్దిగా ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటే పరిస్థితి ఏంటని అన్నారు. ఇవన్నీ ఆలోచించే పదే పదే కలిసి ఉంటాం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. మరి పవన్ చెబుతున్నట్టు 15 ఏళ్ళు కూటమి ఉంటుందా.. లేక మధ్యలో ఇబ్బందులు వస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి.