Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తుఫాన్ సహాయక చర్యలపై కాకినాడ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహాయం పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.. నిత్యావసర వస్తువులు నగదు పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలి.. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు..
Read Also: IND vs AUS: తేలిపోయిన భారత బౌలర్లు.. ఆస్ట్రేలియా ఘన విజయం..!
కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కల్యాణ్.. తుఫాన్ అనంతర ఉపశమన చర్యలపై దిశానిర్దేశం చేశారు.. మొంథా తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నారు.. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించండి అని సూచించారు.. ఇక, తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక సిద్ధం చేయాలి.. పంట నష్టపోయిన ప్రతి రైతుకీ న్యాయం జరగాలని స్పష్టం చేశారు.. మరోవైపు, పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిపై ఆరా తీశారు పవన్ కల్యా్‌ణ్.. ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.. మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
