Deputy CM Narayana Swamy: సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పెట్టుకున్న వాళ్లంతా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు.. జగన్‌కు ద్రోహం చేసినవాళ్లు పుట్టగతులు లేకుండా పోతారంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీలో ఉంటూ జగనన్నకు ద్రోహం చేసే వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు.. సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి ,చంద్రబాబు నాయుడు, ఎర్రమునాయుడు కుటుంబం అడ్రస్ లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు.. ఇక, సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం లాంటివాడు.. మీరు ఎంతమంది మందలు మందలుగా వచ్చినా.. ఆయను ఏం చేయలేరని ప్రకటించారు..
Read Also: Union Budget 2023: ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీర..ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే!
అయితే, మన పార్టీకి సంబంధించిన ఒకరు ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన అనవసరమైన ప్రకటనలు ఇస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు నారాయణస్వామి.. జగనన్నకు ద్రోహం చేసిన వాళ్లు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించిన ఆయన.. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దారుడుగా మనం అంటున్నాం.. మన పార్టీ వాళ్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి జగనన్న వెన్నుపోటుదారులుగా ముద్ర వేసుకోకండి అంటూ హితవుపలికారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. కాగా, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. ఓవైపు ఆనం రాంనారాయణరెడ్డి, మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు కాకరేపుతోన్న సమయంలో.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఇప్పటికే కోటంరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తోన్న విషయం విదితమే.