Narayana Swamy: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నమ్ముకుని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడని.. అయితే ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం ఖాయమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. గతంలో మామకు వెన్నుపోటు పొడిచిన తరహాలో పవన్‌కు కూడా వెన్నుపోటు తప్పదన్నారు. చంద్రబాబు సీఎం పదవి కోసం పరితపిస్తున్నాడని.. మళ్లీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
Read Also: AP Skill Development Scam: AP స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం… ఈడీ ఫోకస్
చంద్రబాబును ప్రజా కోర్టు నుంచి బహిష్కరించాలని ప్రజలకు నారాయణస్వామి పిలుపునిచ్చారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. అటు ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదని నారాయణస్వామి అన్నారు. ప్రతిపక్షాల నేతలు రకరకాల వేషాలతో పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పడతారని నారాయణస్వామి జోస్యం చెప్పారు.