NTV Telugu Site icon

CPM: 175 సీట్లు తప్ప.. జనం గురించి ఆలోచించరా?

V Srinu 7918 (1)

V Srinu 7918 (1)

ఏపీలో విపక్షాలు అధికార వైసీపీ పై మండిపడుతున్నాయి. ఇటీవల ముగిసిన ప్లీనరీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వైసీపీ తీరుపై మండిపడ్డారు. వైసీపీకి 175 సీట్లు, 2024 ఎన్నికలపై తప్ప ప్రజల సమస్యలపై దృష్టి లేదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక సమస్య, ప్రతి గ్రామానికి ఒక అలజడి ఉంది. ఒక చేతిలో పథకాలు పెట్టి మరో చేతిలో నుండి లాగేసుకుంటున్నారని జనం కన్నీళ్లు పెట్టి చెబుతున్నారు.

వైసీపీ ప్లీనరీలో ప్రజల సమస్యల గురించి చర్చించలేదు. దేశంలో మోడీ ప్రభుత్వం అన్పి రంగాల్లో విఫలమైంది. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు చూస్తుంటే…జగన్ మోడీ భజన చేస్తున్నాడు. బీజేపీ నాయకులు అడగకపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఎందుకు బలపరుస్తున్నారో వైసీపీ చెప్పాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడాలి. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పి రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు సీపీఎం నేత శ్రీనివాసరావు. ఏపీలో జగన్ సాలనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Talasani Srinivas Yadav : బీజేపీ ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీ