జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పోరాడే పార్టీ గా చెప్పుకున్న పవన్ కల్యాణ్ ప్రజల తరపున ఎందుకు నిలబడ్డంలేదని.. బద్వేలు ఎన్నికల్లో బిజేపి కి ఎలా మద్దతిస్తారన్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సమస్య పై పవన్ ఎందుకు స్పందించడంలేదని… ఇప్పటికైనా బిజేపి కి మద్దతు ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ ను కోరుతున్నామని వెల్లడించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి ఏమైనా మిగిలివుందా…. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడితే జగన్ ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎంపీలు ఒక్కసారైనా ప్రధాని వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంట్ సమస్యపై మాట్లాడారా… ప్రభుత్వ కార్యాలయాలు , ఆస్తులను అమ్మేస్తోంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ పెడతారని నిలదీశారు.. ఏపీ సర్కార్ దివాలా తేసే ప్రభుత్వమని.. రూ. 140 కోట్ల నిధులకోసం ఆస్తులను తాకట్టు పెట్టే దుస్ధితి వచ్చిందన్నారు. రెండేళ్ల కాలంలో ఎన్ని తాకట్టు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.