Site icon NTV Telugu

Narayana: చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు..!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం.. ప్రభుత్వం వర్సెస్‌ సినీ పరిశ్రమగా మారింది.. కొందరు స్టార్లు ఓపెన్‌గా ప్రభుత్వాన్ని విమర్శంచడంతో ఇది మరింత రచ్చ రచ్చ అయిపోయింది.. కొందరు సినీ పెద్దలు రంగంలోకి దిగి ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సూచించారు.. ఇక, మెగాస్టార్‌ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో ఏకాంతంగా సమావేశం అయ్యారు.. ఎవ్వరూ లేకుండా ఆయన ఒక్కరే వెళ్లడాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వైఎస్‌ జగన్‌-చిరంజీవి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నేత నారాయణ.

Read Also: Surya Kumar Yadav: రెండో వన్డే: సూర్యకుమార్‌ వరల్డ్‌ రికార్డు…

ఫిల్మ్ ఛాంబర్‌కు, నిర్మాతల మండలికి సంబంధం లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌.. కేవలం చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్‌కారం కాదన్నారు నారాయణ.. విభజించు.. పాలించు అనే విధానం సరికాదని సూచించిన ఆయన.. ఉద్యోగుల సమస్యల్లోనూ ప్రభుత్వం విభజించు.. పాలించు అనే విధానం అనుసరించిందని ఫైర్‌ అయ్యారు.. ఇక, ఉద్యోగుల సమస్యలలాగే సినీ పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం మేనేజ్‌ చేయాలని చూస్తోందని ఆరోపించారు నారాయణ.. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. మేనేజ్‌ చేసే వ్యవహారం మంచిది కాదని.. మా, ఫిల్మ్‌ ఛాంబర్‌ని కూడా చర్చలకు పిలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, గతంలోనూ వైఎస్‌ జగన్-చిరంజీవి భేటీపై స్పందించిన నారాయణ.. చిరంజీవి ఒంటరిగా సీఎంను కలవడం ఆయన చేసిన పొరపాటని పేర్కొన్నారు.. చిరంజీవి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరమేంటి. సమస్య సినీ పరిశ్రమదే తప్ప, వ్యక్తిగతంగా చిరంజీవిది కాదుగా అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Exit mobile version