Site icon NTV Telugu

CPI Narayana: మెగా బ్రదర్స్‌పై నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

Cpi Narayana

Cpi Narayana

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సమయంలో నటుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణను సభా వేదికపైకి తీసుకువచ్చి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడ్డారు.. కానీ, ఊసరవెల్లిలాగా ప్రవర్తించే చిరంజీవిని సభావేదికపై తీసుకురావడం సరైంది కాదన్నారు.. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు నారాయణ.. పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్‌మైన్‌ అని వ్యాఖ్యానించిన ఆయన.. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై జనసేన చేస్తున్న నిరసనలను స్వాగతించారు నారాయణ.

Read Also:
Indian Rupee : రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది.? అంతర్జాతీయ పరిస్థితులే కారణమా.?
ఇక, ఏపీకి కేంద్రం చేసింది శూన్యం.. లాంటి సమయంలో ఎన్డీయే బలపరచిన అభ్యర్థికి ఎందుకు ఏపీలోని అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి..? అని నిలదీశారు నారాయణ.. బీజేపీ నేతల బ్లాక్ మెయిలింగ్ లకు ఏపీలో నేతలు భయపడుతున్నారని దుయ్యబట్టిన ఆయన.. విజయవాడ రాజధాని అనే భావనను వైపీసీ పోగొడుతోందన్నారు.. రాష్ట్రం విడిపోయినా ఇంకా హైదరాబాద్ రాజధాని అనుకుంటున్నారు వైసీపీ నేతలు అంటూ మండిపడ్డారు. రాజధాని కావాలన్న చిత్తశుద్థి వైసీపీకి ఏ మాత్రం లేదని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు రాకుండా చూడండి అని సలహా ఇచ్చారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వ నిఘా వైఫల్యంతోనే ఏపీలో వరదలు భీభత్సం సృష్టించాయని విమర్శించారు.. వరదబాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడ్డారు.. సర్వం కోల్పోయిన బాధితులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు సీపీఐ నేత నారాయణ.

Exit mobile version