Site icon NTV Telugu

Ramakrishna: ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా..?

Ramakrishna

Ramakrishna

Ramakrishna: ఏపీలో ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఇది చాలా దుర్మార్గం అన్నారు.. వైఎస్‌ జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శించిన ఆయన.. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి వైఎస్‌ జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిరంకుశమైనది మండిపడ్డారు.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగమే 1861 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులు అని ఆరోపించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతి ఇస్తామంటున్నారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా..? అని నిలదీశారు రామకృష్ణ.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇక, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్, మార్జిన్లకు నిబంధనలు వర్తింపజేయనున్నారు.. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ.

Exit mobile version