Site icon NTV Telugu

ఏపీలోని ఈ జిల్లాలో నేటి నుంచి కఠినంగా కరోనా నిబంధనలు

కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పోలీస్ శాఖ శుక్రవారం నుంచి కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేయబోతోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ధరించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Read Also: దేశంలోనే టాప్.. ఏపీకి 10 స్కోచ్ అవార్డులు

పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే ఫంక్షన్ హాళ్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలని, పరిమితికి మించి జన సమూహం చేరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దుకాణ యజమానులు తమ షాపుల ఎదుట సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేయాలని, షాప్ ఎదుట తాడు కట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై డీఎం యాక్ట్ (డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హోటల్ నిర్వాహకులు హోటల్‌లో సర్వర్లు, ఇతర ఉద్యోగులు ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Exit mobile version