తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఏపీ, తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నాయి పాజిటివ్ కేసులు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,284 శాంపిల్స్ పరీక్షించగా.. 5,879 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. కర్నూలు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇదే సమయంలో.. 11,384 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 3,24,70,712 టెస్ట్‌లు నిర్వహించగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 22,76,370కు చేరుకుంది.. రికవరీ కేసులు 21,51,238కు పెరిగాయి.. మృతుల సంఖ్య 14,615కే చేరుకున్నాయి.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
ఇక, తెలంగాణలో గత 24 గంటల్లో 2,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు మృతిచెందారు.. ఇదే 4,413 మంది కోలుకున్నారు.. ఇదే సమయంలో 4,413 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,63,911కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 7,22,654కు పెరిగాయి.. మృతుల సంఖ్య 4,089కు చేరినట్టు.. ప్రస్తుతం రాష్ట్రంలో 37,168 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
