NTV Telugu Site icon

COVID 19: ఏపీ, తెలంగాణలో 400కు దగ్గరగా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.. తెలంగాణతో పాటు ఏపీలోనూ నాలుగు వందలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్‌ కేసులు.. ఏపీలో గత 24 గంటల్లో 19,769 శాంపిల్స్‌ పరీక్షించగా.. 425 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,486 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,15,950కి చేరుకోగా.. రికవరీ కేసులు 22,93,882కు చేరాయి.. ఇక, ఇప్పటి వరకు 14,710 మంది కోవిడ్‌తో కన్నుమూయగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,358 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read Also: Protocol: గవర్నర్‌ మేడారం టూర్.. ప్రొటోకాల్‌ వివాదం

మరోవైపు.. తెలంగాణలోనూ రోజువారి కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గింది.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 39,288 శాంపిల్స్‌ పరీక్షించగా.. 401 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూశారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,86,422కి చేరింది. ఇప్పటి కోవిడ్‌తో కన్నుమూసినవారి సంఖ్య 4,109కి పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి 865 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5,646గా ఉన్నాయి.