ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వైద్యులకు, వైద్యసిబ్బందికి జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విజయవాడలోని జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. జీజీహెచ్‌లో 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. 20 మంది జూనియర్ వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వైద్యులు, సిబ్బంది హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
Read: చైనా సృష్టి: మొన్న కృత్రిమ సూర్యుడు… ఇప్పుడు కృత్రిమ చంద్రుడు…
వైద్యసిబ్బందితో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్ లో భాగంగా ఉన్న పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
