కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది… ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉద్యోగులను, సిబ్బందిని కరోనా టెర్రర్ వణికిస్తోంది… ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో వివిధ శాఖల్లో పనిచేసే 30 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మహమ్మారి బారినపడగా… ముగ్గురు మృతిచెందారు… దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.. ఇక, గన్నవరం విమానాశ్రయం లో పనిచేసే ఎస్పీఎఫ్ పోలీసులు కూడా కొంతమంది కరోనా బారినపడడంతో.. అందరిలో కరోనా కలవరం మొదలైంది.